
పయనించే సూర్యుడు డిండి నవంబర్ 2( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ నల్గొండ జిల్లా) సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్రలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా డిండి మండలం రామంతాపురం గ్రామంలో ఎండిపోతున్న వరి పంట పొలాలను పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి లు కలిసీ పరిశీలించారు. పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు బాధిత రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాగు కోసం ఇప్పటివరకు చేసిన పెట్టుబడులు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, బోర్లు, బావుల్లో నీటి మట్టం, విద్యుత్ సరఫరా పరిస్థితి, పంటల దిగుబడిపై పడుతున్న ప్రభావం తదితర అంశాలపై రైతులను అడిగి వివరాలు సేకరించారు.వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు తమ గోడును నాయకుల ఎదుట వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. డిండి ఆయకట్టు రైతులు వానాకాలం సీజన్లో రైతులు వేలాది రూపాయలు అప్పులు చేసి వరి, పత్తి తదితర పంటలను సాగు చేశారని తెలిపారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎదుగుదల లేక ఎండిపోతున్నాయని,డిండి ప్రాజెక్ట్ లో నీరు పూర్తి స్థాయిలో పంటలకు రాకపోవడంతో పొట్టదశలో వేలాది ఎకరాల భూమి ఎండిపోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని డిండి మండల రైతంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.ముఖ్యంగా బోర్లు, బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కూడా రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని అన్నారు. ఒకవైపు పెట్టుబడుల భారం, మరోవైపు పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరువును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఆర్థిక సాయం, సాగునీరు, విద్యుత్ సరఫరా, పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పంటల పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి నల్లగొండను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి. మైనోద్దీన్, సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,మండల సహాయ కార్యదర్శులు తిప్పర్తి విజేందర్ రెడ్డి,బొల్లె శైలేష్, మండల కార్యవర్గ సభ్యులు ఎలిమినేటి హుస్సేన్, నూనె వెంకటేశ్వర్లు,సోమిడి శ్రీను, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎనమల్ల నవీన్,తిరుపారి వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ డివిజన్ అధ్యక్షులు వినయ్,శాఖ కార్యదర్శులు చక్రి,శ్రీను,వెంకట్ రెడ్డి,అయోధ్య, రాములు, ఎ ఐవైఎఫ్ మండల అధ్యక్షులు కాంపల్లి ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.