ఎండ తీవ్రతతో పూర్తిగా దగ్ధమైన స్కూటీ

తప్పిన పెను ప్రమాదం

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ మే 23/26 ఎండ తీవ్రతతో స్కూటీ పూర్తిగా దగ్ధమైన సంఘటన జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఓ కుటుంబం తమ స్కూటీపై ఖమ్మం నుండి పాల్వంచ వెళుతుండగా మార్గమధ్యంలో జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామం సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి స్కూటీపై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే స్కూటీ దిగారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు వాహనంలోని పెట్రోల్ ట్యాంకు అంటుకోవడంతో స్కూటీ పూర్తిగా దగ్ధమైంది చుట్టుపక్కల పొలాల వారు మంటల ఆర్పేందుకు ప్రయత్నించిన అప్పటికే స్కూటీ పూర్తిగా దగ్ధమైపోయింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది ఈ సంఘటనతో కొత్తగూడెం ఖమ్మం జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి