ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు పిలుపుతో మానవత్వం చాటుకున్న టీడీపీ రాజంపేట పార్లమెంటు సెక్రటరీ పర్వీన్ తాజ్ బృందం.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 20.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// తెలుగుదేశం పార్టీ (టిడిపి ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు.. పుంగనూరు పట్టణంలోని కట్టమీద రోడ్డు పక్కన,తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, శామీర్ లాల్ మరియు సద్దాం హుస్సేన్ ల బృందం అండగా నిలిచింది. వాతావరణ మార్పుల వల్ల, ఎండ మరియు అకాల వర్షాల నుండి తమ వ్యాపారాలను, సరుకులను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేద వ్యాపారుల కష్టాలను గుర్తించి, చల్లా బాబు వారి సూచనల ప్రకారం వారికి ఉచితంగా టార్పాల్ (టార్పాలిన్) పట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ.. సమాజంలో కష్టపడి జీవించే చిరువ్యాపారులకు అండగా నిలవడం తమ బాధ్యత అని, చల్లా బాబు దిశానిర్దేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల చిరువ్యాపారుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకే ఈ చిన్న సహాయం చేశామని వారు తెలిపారు. తమ ఇబ్బందులను అర్థం చేసుకుని, సమయానికి ఎంతో ఉపయోగపడే టార్పాల్ పట్టాలను అందించినందుకు కట్టమీద ప్రాంత తోపుడు బండ్ల వ్యాపారులు చల్లా బాబు వారికి అలాగే పర్వీన్ తాజ్, శామీర్ లాల్, సద్దాం హుస్సేన్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూరుల్లా ,ముజాహిద్, నూరుల్లా మౌల ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.