ఎంపికైన అంగన్వాడీలకు ఆర్డర్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే నానాజీ..

పయనించే సూర్యుడు జూన్ 13, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నూతనంగా ఎంపికైన అంగన్‌వాడీ సహాయకురాలు అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ సహాయక లకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా 10 మంది మహిళా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డర్ కాపీలు అందుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణీలకు అంకితభావంతో సేవలు అందిస్తూ విధులు నిర్వహించాలని చెప్పారు… ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.