ఎంపీఈ డిస్టిలరీ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలి ఎమ్మార్వోకు సరాపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం వినతిపత్రం సమర్పించారు

పయనించేసూర్యుడు. న్యూస్.4. జులైపుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా. ఉమ్మడి పుల్కల్ మండలం. ​చౌటకూర్ మండలం. ఎ.పి.ఈ. డిస్టలరి ప్యాక్టరి చౌటకూర్ పరిసర ప్రాంతాల ప్రజలను కాలుష్య కోరల్లోకి నెట్టడమే కాకుండా, తాజాగా రైతుల దారిని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న ఎంపీఈ డిస్టిలరీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సరాపల్లి గ్రామ పాలకవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు చౌటకూర్ ఎమ్మార్వో నామాల కిష్టయ్య గారికి సరాపల్లి ఉప సర్పంచ్ లక్ష్మీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులతో కలిసి గురువారం ఒక వినతిపత్రాన్ని సమర్పించారు ​ప్రధాన సమస్యలు మరియు ఆరోపణలు: ​రైతుల దారి కబ్జా: చౌటకూర్ గ్రామంలో ఉన్న ఎంపీఈ డిస్టిలరీ కంపెనీ, పరిసర గ్రామాల రాజకీయ నాయకుల అండతో 50 సంవత్సరాలుగా రైతులకు, గ్రామస్తులకు పంట పొలాలకు వెళ్లే రహదారిని కబ్జా చేస్తూ ప్రహరీ గోడను నిర్మిస్తోంది. ​కంపెనీ మొండివైఖరి: గతంలోనే ఈ నిర్మాణంపై గ్రామస్తుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, స్థానిక నాయకుల మద్దతుతో కంపెనీ యాజమాన్యం యథేచ్ఛగా నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. ​కాలుష్య కోరల్లో గ్రామాలు: కంపెనీ స్థాపించిన నాటి నుండి పరిసర ప్రాంతాల రైతులు, గ్రామస్తులు తీవ్ర కాలుష్య బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ​గ్రామస్తుల డిమాండ్: "స్థానిక నాయకుల అండతో రెచ్చిపోతూ, రైతుల నోరు కొడుతున్న కంపెనీ అక్రమ ప్రహరీ గోడ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు తక్షణమే అడ్డుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలి." ​ఈ కార్యక్రమంలో సరాపల్లి గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మీ, పాలకవర్గ సభ్యులు, బాధితులైన రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.