ఎక్లాస్‌పూర్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, గేమ్స్ కిట్ పంపిణీ.

పయనించే సూర్యుడు జూన్ :16 హుజురాబాద్ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజున విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే నియోజకవర్గ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో క్రీడా సామగ్రి (గేమ్స్ కిట్)ను విద్యార్థులకు అందజేశారు.ఈ
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ తాడవేని కార్తీక్, ఎంఈఓ రవీందర్, శ్రీధర్ రెడ్డి, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని పలువురు ఆకాంక్షించారు.