ఎన్నికల విధుల్లో పాల్గొన్న వీడియో గ్రాఫర్లకు వేతనాలు చెల్లించాలి: కలెక్టర్‌కు వినతి

​పయనించే సూర్యడు జూలై 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ, మునగాల, చిలుకూరు, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో ఎన్నికల విధుల్లో భాగంగా 15 రోజుల పాటు పని చేసిన వీడియో గ్రాఫర్లకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీడీఓ ఆదేశాల మేరకు తాము ఎఫ్.ఎస్.టి మరియు ఎస్.ఎస్.టి బృందాలతో కలిసి పని చేశామని తెలిపారు. మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి అహర్నిశలు శ్రమించామని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా వీడియో గ్రాఫర్లుగా ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించామని, కానీ ఇప్పటివరకు తమకు రావాల్సిన వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిధుల నుండి తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఓరుగంటి సురేష్, ఆదిమల్ల శేషగిరిరావు, ఆకంతి కార్తీక్, ఆజు మహే, దుర్గయ్య, పుల్లారావు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యను సానుభూతితో పరిశీలించి, తక్షణమే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు.