ఎన్యుమరేషన్ ఫారాల కోసం హెల్ప్ డెస్క్

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 9 బోధన్ :బోధన్ పట్టణంలోని 28వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ముజాహిద్ అలీ ఆధ్వర్యంలో ఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఫారాలు నింపడం తెలియని కాలనీ వాసులకు అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. కార్యక్రమంలో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ జయంత్, అంగన్వాడీ టీచర్ పార్వతి, ఆశా వర్కర్ జాకెరతో పాటు ఇంతియాజ్, ఫాయిమ్, ఖలీం, అమీర్, ఇమ్రాన్, ఖాన్,కబీర్ తదితరులు పాల్గొన్నారు.