ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులతో విజయం దిశగా యువనేత సంకా హరీష్

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 6 , వత్సవాయి మరియు జగయ్యపేట్ట మండలాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల పరిస్థితిపై ఎన్ హెచ్ ఆర్ సీకి దాఖలైన ఫిర్యాదును పరిశీలించారు. మన ప్రాంతంలో మంజూరైన 29 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో కేవలం 4 మాత్రమే పనిచేస్తుండగా, మిగిలిన 25 కేంద్రాలు సిబ్బంది మరియు ప్రాథమిక సౌకర్యాల కొరతతో నిర్వీర్యమై ఉన్నాయి. ఈ ప్రజల ఆరోగ్య సేవకు ప్రభావితం చేస్తోందనే అంశంపై, ఆర్టికల్ 21 కిందే హక్కు ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదు ఎన్ఆర్ హెచ్ఆర్సి లో దాఖలైంది. 05-06-2026న ఎన్ హెచ్ఆర్సి , ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు ప్రతిని పంపి, సంబంధిత అవసరమైన చర్యలు తీసుకుని 4 వారాల్లోగా ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యువనేత సంకా హరీష్ ని ప్రజలు అభినందిస్తున్నారు.