పయనించే సూర్యుడు జూన్ 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జడ్పీహెచ్ఎస్ వాకలపూడి కాకినాడ రూరల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాకలపూడి, కాకినాడ రూరల్ మండలం నందు రెండో రోజుకు చేరుకున్న ఎఫ్ఎల్ ఎన్ శిక్షణ కేంద్రమును ఏపీసి, వివివి సత్యనారాయణ , సమగ్ర శిక్ష కాకినాడ వారు సందర్శించి ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య నిస్సంకోచముగా అందించడం జరుగుతుందని, కానీ సరిఅయిన ప్రచారం లేక పూర్తిస్థాయిలో ప్రజలకు చేరడం లేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం విద్యార్థుల నమోదు సరళిని చూస్తే భవిష్యత్తులో విద్యార్థుల- ఉపాధ్యాయుల నిష్పత్తి ఘన నియమగా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కానీ ఈ వేసవిలో ఉపాధ్యాయులు, అధికారులు సమిష్టి కృషి కారణంగా విద్యార్థుల నమోదు లక్ష్యానికి దగ్గరగా చేరడం సంతోషదాయకంగా ఉంది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి ఈ శిక్షణ కార్యక్రమానికి అన్ని సదుపాయాలు అందేలాగా కోర్సు కోఆర్డినేటర్ శ్రీ బి. శ్రీనివాస్ కుమార్ మరియు సెంటర్ ఇన్చార్జి పి.ఎస్. ఈశ్వర శాస్త్రి గారు అతి తక్కువ సమయంలో చేయగలిగినారు అని అభినందించారు. వాతావరణ వేడిగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరుతో ఐ ఈ కోఆర్డినేటర్ మరియు ఇన్చార్జి సి ఎం ఓ గిరి ప్రసాద్ హాజరైనారు. అనంతరం న్యూ టెస్ట్ బుక్ పంపిణీ విధానాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసినారు సి ఆర్ ఎం టి ఆఫీస్ సిబ్బందిని పనితీరును అభినందించారు తరువాత అదనపు తరగతి గదుల జరుగుతున్న పనిని పరిశీలించి పని ఆగకుండా క్రమముగా జరగాలని, ఇన్ టైంలో పని పూర్తి చేయాలని సూచించారు.