పయనించే సూర్యుడు 8-7-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం తో పాటు గ్రామల లో ఎమ్మార్పీఎస్ 32 వ ఆవిర్భావ దినోత్సవ మరియు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు,మండల కేంద్రం లో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చెవులమాద్ది రమేష్,ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ పద్మశ్రీ.మందకృష్ణ మాదిగ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల్లోని పదిహేను శాతం రిజర్వేషన్లు ఎవరి జనాభా ఎంతో వారివాటా అంతా అని జనాభా నిష్పత్తి రిజర్వేషన్లను వర్గీకరించాలని 1994లో జులై 7న.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఎస్సీల వర్గీకరణ సాధనకై 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ విషయంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కొంతమంది ప్రాణ త్యాగాలు కూడా చేశారు జాతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ సందర్భంగా వారికి జోహార్లు కూడా తెలియడం జరుగుతుంది ఎస్సీలు వర్గీకరణ సాధించుకున్న ఫలాలు మా జాతి బిడ్డలు అన్ని రంగాల్లో అందిపుచ్చుకొని విజయ పదంలో నడిచి అభివృద్ధనడిచిు ప్రయాణించాలని మందకృష్ణ మాదిగ కలలు కన్నటువంటి జాతి అభివృద్ధి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మన జాతి అగ్రస్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఆ దిశగా మనమందరం కూడా మన పిల్లలు ఉన్నత విద్య చదివించి మన సాధించిన హక్కులను పొందాలని సందర్భంగా ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు రేగుంట బాపయ్య, ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గంగాధర మధుసూదన్ గ్రామ శాఖ అధ్యక్షులు మనలా ప్రభు, ఉపాధ్యక్షులు మనలా సంజీవ్,చెవులమద్ది శేఖర్, వేల్పుల రాజేష్, శాతల్ల లక్ష్మణ్, జేరిపోతుల అమోస్, ఎనగందుల రమేష్, నక్క అశోక్, గొల్లపల్లి వెంకటేష్,చెవులమద్ది నరసయ్య, దాసారపు సదానందం,మద్దూరి అశోక్, రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.