ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో నాయకుల నివాళి

పయనించే సూర్యుడు జులై 8 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల, గ్రామ కమిటీల అధ్యక్షుడు మొలకలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి పరశురామ్ పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం గత 32 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ సాధనతో పాటు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాల సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బండారి విష్ణు, మీసాల శీను, మీసాల నాగన్న, నాని , దేవుని గణేష్, రాధాకృష్ణ, ప్రవీణ్, మీసాల శివ, గడ్డమీద రవి, రవితేజ, గడ్డల వినోద్, కర్ణాకర్, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.