ఎమ్మిగనూరు లో ఉన్న ఎం ఎస్ నగర్ హెచ్ఎం కు మామూళ్లు ఇస్తేనే విద్యార్థులకు టీసీలు

ఆదోని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘ నాయకులు.

పయనించే సూర్యుడు జూన్ 2 ఆదోని రూరల్ రిపోర్టర్ ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కు విద్యార్థులు మామూలు ఇస్తేనే టీసీలు ఇస్తున్న హెచ్ఎం పై ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ కి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణం ఎం ఎస్ నగర్ జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో విధులు నిర్వహిస్తున్న హెచ్ ఎం పదవ తరగతి విద్యార్థుల టీ సీ ల కొరకు వెళితే ఒక్కొక్క విద్యార్థి దగ్గర 300 నుండి 400 రూపాయలు వసూలు చేయడం దారుణమని అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా అడుగులు వేస్తూ ఉంటే ఈమె మాత్రం విద్యార్థులకు డబ్బులు ఎలా వసూళ్లు చేయాడం ఎలానో నేర్పించే దిశగా తీసుకువెళ్తుంది. ఆ డబ్బులు లేకనే పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఉచిత ప్రభుత్వ బడులకు పంపిస్తూ ఉంటే ప్రభుత్వ బడుల్లో కూడా ఇలాంటి వారు డబ్బులు వసూలు చేస్తే పేద విద్యార్థులు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు కట్టాలి అన్నటువంటి విద్యార్థులను బెదిరింపులకు గురి చేయడం అదేవిధంగా విద్య హక్కు చట్టంలో పేద విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు అక్రమంగా వసూలు చేయాలి అని ఏ ఆర్టికల్ లో ఉంది అని మాకు చెప్పాలి అని వారు అడగడం జరిగింది.ఇలా పేద విద్యార్థులపై ఆర్థిక భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ అక్రమ వసూళ్లు ఇదొక్క సంవత్సరమే జరగలేదు అని ఆమె పాఠశాలకు హెచ్ ఎం గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇదే విధంగానే ఆమె తీరు ఉంది అని వారు అన్నారు ఇకనైనా పై విద్యాధికారులు ఈ సమస్య పైన స్పందించి పేద విద్యార్థుల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎంఎస్ నగర్ హెచ్ఎం పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.