
పయనించే సూర్యుడు నవంబర్ 3, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) స్థానిక జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కుటమి అభ్యర్థులు గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ సోమవారం నేమం గ్రామం శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అభ్యర్థులతో ప్రచారం నిర్వహించారు. అనంతరం పండురు, పి వెంకటాపురం తిమ్మాపురం గ్రామంలో మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో మరియు సర్పవరం గ్రామంలో జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రతి వీధి వాడ వెళుతుంటే మేము చేసిన అభివృద్ధిని తెలియపరుస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. మాపై ప్రజలకు విశేష అభిమానం స్పందన ఉందని తెలిపారు. కుటమి అభ్యర్థులను సైకిల్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, శ్రీనివాస్ బాబా, కడలేశ్వరి, కర్రి వెంకటరాజు, మంగా గంగయ్య, నందిపేట రమణ, మాదారపు తాతాజీ, భారీ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూటమి నాయకులు పాల్గొన్నారు.