ఎస్సారెస్పి భూమిని, కోర్టుకి అప్పగించాలి.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 2 మెట్ పల్లి కోర్టు ఆవరణలో ఉన్న ఎస్సారెస్పి భూమిని, కోర్టుకి అప్పగించాలని కోరుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రామ్ రెడ్డి సోమవారం ప్రజావాణి లో దరఖాస్తు చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోర్టు లో అదనపు భవనాల నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న 38 గుంటల ఎస్సైరెస్పి భూమిని కోర్టు కి అప్పగించాలని కోరుతూ, ఆర్డివో కి విన్నవించినట్టు తెలిపారు. ఆయన వెంట ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, కోశాధికారి బిగుల్లా శంకర్, సాంస్కృతిక కార్యదర్శి కాజీపేట స్రవంతి, ఈసి మెంబర్ మాలేపు సంధ్యారాణి పాల్గొన్నారు.