పయనించే సూర్యుడు జులై 6 రాజేష్ ) గో టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలోని దోల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో మాదిగ ప్రజలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు మాదిగ పాల్గొని మాట్లాడుతూ మాదిగలు విద్యా ప్రాముఖ్యతను గుర్తించాలని, సంపూర్ణ అక్షరాస్యత సాధించే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో చదువుతున్న పిల్లల్ని ప్రోత్సహించాలని, అలాగే చదువులకు దూరమైన విద్యార్థులను తిరిగి చదువుకునేలా ప్రోత్సహించాలని ఎస్సీ వర్గీకరణ ఫలాలను ఉపయోగించుకొని విద్యా ఉద్యోగాలలో రాణించాలని కోరడం జరిగింది. అలాగే ఈ నెల జూలై 7న ఎమ్మార్పీఎస్ 32 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణను పెద్ద ఎత్తున చేపట్టాలని కోరడం జరిగింది. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దేవగిరి స్వామి మాదిగ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల సీనియర్ నాయకులు యాకంటి యాదయ్య మాదిగ మరియు ఆంజనేయులు మాదిగ గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నవీన్ మాదిగ ,శివ మాదిగ ,కరుణాకర్ మాదిగ,కార్తీక్ రాజు నర్సిములు ముత్యం వంశీ ప్రవీణ్ నర్సిములు రవీందర్ మహేష్ అవినాష్ మల్లేశం యువకులు తదితరులు పాల్గొన్నారు