
పయనించే సూర్యుడు జులై 08, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకవర్గ ఎస్ ఐ ఆర్ ఇంచార్జ్ మల్లెల అజయ్, మండల ఇంచార్జ్ తిరుపతి యాదయ్యలు మంగళవారం పరిశీలించారు. చింతకాని మండలంలోని నాగులవంచ, చింతకాని, పొద్దుటూరు, జగన్నాధపురం గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వారు పరిశీలించి, ఎన్్యూమరేషన్ ఫారమ్‌లను నింపే విధానంపై బూత్ స్థాయి సిబ్బంది, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బూత్ ఏజెంట్లు ప్రతి ఓటరిని కలిసి ఎన్్యూమరేషన్ ఫారమ్‌ను సక్రమంగా నింపించి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగార్జున, గ్రామ బీఎల్ఓ చామర్తి కృష్ణమాచారి,ఎస్ ఐ ఆర్ సూపర్వైజర్ వంగూరి రమేష్, కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.