ఎస్ ఐ ఆర్ కు ప్రతి ఒక్కరు సహకరించాలి.. ఆర్డీవో మల్లిబాబు..

పయనించే సూర్యుడు జూలై 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఎస్ ఐ ఆర్ ప్రక్రియ కాకినాడ రూరల్ నియోజకవర్గం లో వేగంగా జరుగుతుందని ప్రజలు బిఎల్ఓల కు బి ఎల్ ఏ లకు సహకరించాలని కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు తెలియజేశారు. సోమవారం కాకినాడ రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి రెండు లక్షల 71 వేల 318 మంది ఓటర్లు ఉన్నారని ఇప్పటికే 99.9 డిస్ట్రిబ్యూషన్ జరిగిందని 50% డిజిటలైజేషన్ జరిగిందని లక్ష ఇరవై రెండు వేల డిజిటలైజేషన్ జరగాలని తెలిపారు. ఈనెల 14 వరకు ఇది కొనసాగుతుందని ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయని ప్రజలు వెంటనే వాటర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు.