ఏపీలో మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ దండాయన’ ప్రారంభం.

★ 2025 జనవరి నుండి 2026 మే 28 వరకు కర్నూలు జిల్లాలో 10 కేసుల్లో 17 మందికి కఠిన శిక్షలు. ★ ​పోక్సో కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష . ★ నిందితులపై 59 రౌడీషీట్లు ఓపెన్ చేశాం. ​జీరో టాలరెన్స్ ... కాన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్: ★ మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత

పయనించే సూర్యుడు న్యూస్ మే 30, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్లలో “ఆపరేషన్ దండాయన” పోస్టర్ ను ఆవిష్కరించిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ 60 రోజుల్లోనే చార్జిషీట్ …ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్షలు తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాలలో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆధ్వర్యంలో, మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి ఐపీఎస్ పర్యవేక్షణలో “ఆపరేషన్ దండాయన” కార్యక్రమాన్ని ఏపీ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు ఎస్పీ శ్ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గోనెగండ్ల పోలీసుస్టేషన్ సమీపం లోని భాషా ఫంక్షన్ హాల్ లో మహిళల భద్రత , నేరాల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు . మహిళల పై జరిగే నేరాల విషయంలో “జీరో టాలరెన్స్ పాలసీ” అమలు చేస్తూ, అత్యాచారాలు, పోక్సో, గృహ హింస తదితర కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయడం, ముఖ్యమైన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయడం, నేరస్తులపై నిరంతర నిఘా ఉంచడం జరుగుతోందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. పునరావృత నేరస్తులు, మహిళలపై నేరాలకు పాల్పడుతున్న అనుమానితులపై సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరిచి ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో 2025 జనవరి నుండి 2026 మే 28 వరకు మొత్తం 10 కేసుల్లో 17 మందికి శిక్షలు పడినట్లు తెలిపారు. ఇందులో పోక్సో , మహిళలపై వేధింపులు, ఎస్సీ / ఎస్టీ చట్టాలకు సంబంధించిన కేసులు ఉన్నాయన్నారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా 42 అవగాహన కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్ల వారీగా 687 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. 2025-2026 సంవత్సరంలో మహిళలపై నేరాలు మరియు పోక్సో కేసుల్లో నిందితులపై ప్రత్యేక నిఘా చర్యల్లో భాగంగా మొత్తం 59 మంది నిందితుల పై రౌడీ షీట్లు ఓపెన్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, మహిళా పియస్ డిఎస్పీ ఉపేంద్రబాబు, ఎమ్పిడిఓ మణిమంజరి, గోనెగండ్ల ఎమ్మార్వో రాజేశ్వరి, గోనెగండ్ల పియస్ సిఐ చంద్రబాబునాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ మల్లయ్య , మహిళలు పాల్గొన్నారు.