పయనించే సూర్యుడు జూన్ 5, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (ఆర్ ఎన్ ఓ.1104) కాకినాడ జిల్లా మొట్టమొదటి ప్రాంతీయ కార్యవర్గ సమావేశం మరియు నూతన జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఈ రోజు కాకినాడ నగరంలోని ఆర్ టి ఓ ఆఫీస్ రోడ్డులో గల ఏపీ సొసైటీ సహకార నిలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి వి.ఎస్.ఆర్.కె. ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎన్నికల అధికారిగా యూనియన్ కంపెనీ అధ్యక్షులు వి.వి.ఎస్. నాగేశ్వరరావు , ప్రాంతీయ అధ్యక్షులు ఎం.వి. రమణ పాల్గొన్నారు. సుమారు 350 మంది సభ్యులు హాజరైన ఈ జిల్లా ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా ఆర్. రాంబాబు , లైన్ ఇన్స్పెక్టర్, జిల్లా కార్యదర్శిగా జి. శ్రీనివాస్ , జే ఏ ఓ, ఉపాధ్యక్షులుగా శ్రీ వి. బాలకుమార్ , లైన్మెన్, ఏ.ఎస్.ఎస్. విక్రాంత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తో పాటు ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గణపతి వి.ఎస్.ఆర్.కె. మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈపీఎఫ్ టు జిపిఎఫ్, జేఈఈ/జేఏ కన్వర్షన్స్ , పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నూతన పీఆర్సీని ఏర్పాటు చేయాలని, అలాగే జే ఎల్ ఎం ఉద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులను సభలోని ప్రతినిధులు అభినందిస్తూ, యూనియన్ బలోపేతం మరియు ఉద్యోగుల హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.