ఏలేశ్వరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవపై అవగాహన ర్యాలీ

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 06 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో టిడిపి పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ దుర్గా రాంప్రసాద్, పాల్గొన్నారు.ముందుగా ఏలేశ్వరం పట్టణంలో గల కప్పలచెరువు ప్రాంగణంలో మొక్కలు నాటారు, అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. తమ నివాసాల వద్ద కనీసం ఒక మొక్క నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేపట్టాలని సూచించారు. నిషేధిత పాలిథిన్ కవర్లు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. మొక్కల పెంపకం పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలు అవగాహన కలిగి పూర్తి ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎండగుడి నాగబాబు, పెండ్ర శ్రీను, కోణాల వెంకట రమణ, రాయుడు చిన్న, పతివాడ అఖిలేష్ సామంతుల గోపి, సిడగం బాలు, శశి స్వామి, కర్రోతు గాంధీ, మున్సిపాలిటీ సిబ్బంది, అటవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.