ఐఎంఏ నూతన కార్యవర్గం ఎంపిక

పయనించే సూర్యుడు-03-07-2026-రాజంపేట న్యూస్ : జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని 2026-2028 కి గానూ గురువారం రాజంపేట ఐఎంఏ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు ఆధ్వర్యంలో రాజంపేట అధ్యక్షులుగా డాక్టర్ జయ గౌరి, కార్యదర్శిగా మునిబాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి దగ్గుబాటి నవీన్ కుమార్, కోశాధికారిగా విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికైన నూతన కార్యవర్గం మాట్లాడుతూ తమకు లభించిన పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని తెలియజేశారు.