ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

★ సకలజనుల సమ్మెలో సింగరేణి ఉద్యోగుల పాత్ర కీలకం: ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-03 ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఆర్జీ3 ఓసీ1 ఆపరేషన్స్ సైట్ ఆఫీసు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. సోనియా గాంధీ చొరవతో అసెంబ్లీలో బిల్లు పెట్టిన శ్రీధర్ బాబు ని ఈసందర్భంగా గుర్తుచేసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికులు, నాయకులు ఒకరికొకరు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అన్ని గనులు, కార్యాలయాల్లో సంతోషంగా, సంబరంగా వేడుకలు జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. సకలజనుల సమ్మెలో సింగరేణి ఉద్యోగులు పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ, తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ గని పిట్ కార్యదర్శి తోకల ప్రవీణ్ రెడ్డి, నాయకులు కొలిపాక సారయ్య, మాడుగుల ప్రభాకర్ రెడ్డి, కొట్టే రాంచందర్ రావు, సాతిని నాగరాజు, గంధం శ్రీనివాస్, కాంటెవాడ బుగ్గాజీ, అధికారులు, సూపర్వైజర్లు, ప్రైవేట్ వాహన డ్రైవర్లు, మహిళా ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.