పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 2 పోలవరం జిల్లా చింతూరు మండలం గ్రామపంచాయతీ చట్టి లో ది 31.05.2026 న పెసా అధ్యక్షుడు తుర్రం. చిన్న ముత్తయ్య అధ్యక్షతన పెసా గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభను ఉద్దేశించి ఏజెన్సీ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక మరియు పంచాయతీలో వివిధ రకాల సర్టిఫికెట్లు మంజూరు విషయంలో గ్రామసభ తీర్మానాలే అత్యంత కీలకం. అలాగే గ్రామాలలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం మరియు గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవడంలో గ్రామసభ అత్యంత పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామసభ ముఖ్య ఉద్దేశం గ్రామంలో వలస గిరిజనేతరులు ఎవరైనా కొత్తగా గృహాలు నిర్మించాలన్న మాయ మాటలతోటి గిరిజన భూములు కొనాలన్న గ్రామపంచాయతీ, గ్రామసభ నుండి అనుమతులు తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. వాటిని ఉల్లంఘించి ఎవరైనా తప్పుగా నిర్మాణాలు చేపడితే ఆ నిర్మాణాలు పెసా చట్ట ప్రకారం చట్ట విరుద్ధం. మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం లైసెన్స్ హక్కుదారులు ఉండగా బెల్ట్ షాప్ నిర్వహణలు జరిగితే ప్రజా ఆరోగ్య దృష్ట్యా బెల్ట్ షాపుల నిర్మూలన లైసెన్స్ హక్కుదారులే బాధ్యులు, గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీకి ఆదాయం లేకుండా అనుమతులు లేని వ్యాపారాలను గుర్తించి గ్రామసభ తీర్మానం చేసి గ్రామపంచాయతీ అధికారులు ద్వారా నోటీసులు జారీ చేసి అక్రమాలను నియంత్రంచవచ్చు. మరి ముఖ్యంగా పోలవరం విషయంలో చట్టి వీరాపురం గ్రామాలను కాంటూరు లెక్కల ప్రకారం 41.15లో ముందస్తుగా పరిహారం ఇవ్వగలరని గతంలో న్యాయపోరాటం చలో చింతూరు ఐటీడీఏ అనే కార్యక్రమం గ్రీవెన్స్ లో ఆర్జీలు పెట్టిన ఫలితం శూన్యం. చివరకు కాంటూరు లెక్కల ప్రకారం 45.72లో ఉంది కాబట్టి భవిష్యత్తు కార్య చరణ కోసం పోలవరం పునరావాసం ఎప్పుడు ప్రకటించిన 5వ షెడ్యూల్ ప్రాంతాలలో ప్రభుత్వ ప్రజాదనం దుర్వినియోగం కాకుండా గ్రామ సభల ద్వారా చట్టపరమైన నియమాలను పాటించే విధంగా చూడాల్సిన బాధ్యతగా గ్రామసభ నిర్ణయించింది. గ్రామ సభలో చర్చించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత గ్రామసభ అన్ని విషయాలను సంపూర్ణ ఆమోదం తెలియజేసింది. గ్రామసభ తీర్మానాలు సంబంధిత అధికారులకు అందజేసి తద్వారా అధికారుల ద్వారా అవసరమైన గ్రామసభ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెసా కమిటీ కార్యదర్శి పోడియం. రామకృష్ణ గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ, యువకులు పాల్గొనడం జరిగింది.