పయనించే సూర్యుడు; తేదీ: 4 జూన్ గురువారం, 2026. పాత్రికేయులు, ఆడెపు సంతోష్ కుమార్; మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. గ్యాస్ సిలిండర్ల ధరలు బాగా పెరగడంతో.. చాలామంది కట్టెల పొయ్యినే వాడుతున్నారు..అన్ని వాణిజ్య వర్గాలపై గ్యాస్ ధర పెరుగుదల ప్రభావం..! వసతి గృహాలు భోజనశాలల్లో ధరల పెరుగుదల..!! వసతి గృహాలు భోజనశాలలను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళుతున్న యువత..!అంతకంతకు పెరుగుతున్న గ్యాస్ ధర అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా హోటల్ల, హాస్టల్ల నిర్వహణ భారంగా మారింది. దీంతో వాటి నిర్వాహకులు ధరల పెంచడంతో ఉద్యోగ యువత, కళాశాల విద్యార్థులు పోటీ పరీక్షల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వరంగల్ నల్గొండ ఖమ్మం కరీంనగర్ తదితర నగరాల్లో అద్దె గదుల్లో.. హాస్టల్లో ఉంటూ.. ఉన్నత విద్య అభ్యసించే వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులతో ఈ ఏడాది వాణిజ్య సిలిండర్ ధర ఆరుసార్లు పెరిగింది గత ఏడాది డిసెంబర్లో 19 కిలోల గ్యాస్ ధర రూ1800 ఉండగా ఈ నెల ఒకటిన 52 రూపాయలు పెరిగింది… ప్రస్తుతం గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్ (14.2 కేజీలు): రూ 965, వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ (19 కేజీలు): తాజా పెంపుతో కమర్షియల్ సిలిండర్ ధర సుమారు..రూ3,367 కు చేరింది. హైదరాబాదులో కొన్ని ప్రాంతాల్లో హాస్టల్లో ఉండే విద్యార్థులు యువత నుండీ నెలకు 8500 నుంచి తొమ్మిది వేల రుసుము ఉన్న చోట ఇప్పుడు పదివేలకు పైగా వసూలు చేస్తున్నారు. హోటళ్లలో అల్పాహారంపై 10 వరకు భోజనం పై 15 వరకు కర్రీ పాయింట్లలో 10 వరకు ధరలు పెరిగాయి.. ఒకవైపు ఎండల మంట… మరోవైపు ధరల మంట..ఏమి చేయాలో తెలియని యువత.