02 Nov 2026 | 10:42 PM

కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు

రైతులను ఆదుకోకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదుకాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్ ఆగ్రహం

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 02 కడ్తాల్ మండల రిపోర్టార్ సురేందర్ గౌడ్ : రైతులను ఆదుకోకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు.కల్వకుర్తి నియోజకవర్గంపై రేవంత్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు మండిపడ్డారు.కడ్తాల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపేది లేదని, రైతులు సాగు చేసిన పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనివిమర్శించారు.సోమవారం కడ్తాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతుల పంటలు ఎండిపోయి పెట్టుబడులు నష్టపోయినప్పటికీ కరువు మండలంగా ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.కల్వకుర్తి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి కల్వకుర్తి నియోజకవర్గంపై ప్రేమ లేదా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలను గుర్తించి వెంటనే కడ్తాల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కడ్తాల్ ను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలిఅని ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కడ్తాల్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రైతుల సమస్యలపై స్పందించని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు శ్యామల ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ భూపాల్, జగన్ యాదవ్, మాజీ వైస్ ఎంపిపి ఆనంద్, పట్టణ అధ్యక్షుడు కడారి రామకృష్ణ, నాయకులు వీరయ్య సర్పంచ్ గోపాల్ రామచందర్ ప్రియా రమేష్ చిట్టి రమేష్ మాజీ సర్పంచులు తులసి రామ్ నాయక్ యాదయ్య నరసింహ గౌడ్ శ్వేతా భూనాథ్ సులోచన సాయిలు భాగ్యమ్మ జంగయ్య పూజా దేవా మాజీ ఎంపీపీ సువాలి పంతు మాజీ ఎంపిటిసి రంగయ్య నాయకులు శ్రీనివాస్ గౌడ్ కోట్య నాయక్, రమేష్, కుమార్ లాయక్ అలీ, గణేష్ గౌడ్, రవి,యాదయ్య, పాండు నాయక్, వినోద్,సంతోష్ కుమార్ రమణ మహేష్ లింగం రాములు రామచంద్రయ్య మహేష్ శ్రీకాంత్ వెంకటేష్ నరసింహ అంజి శ్రీశైలం సాబీర్ రవి సరియా నాయకులు తదితరులు పాల్గొన్నారు.