పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 10 వత్సవాయి గ్రామంలోని ఈ రోజున న రాష్ట్ర వ్యాప్త పిలుపు లో భాగంగా వత్సవాయి మండల కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశంలో పాల్గొని కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలని, అన్ని రకాల సెలవులు, అంత్యక్రియ ఖర్చులు ఇవ్వాలని, ఆశాల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలని ,పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆశ వర్కర్స్ సంఖ్యని పెంచాలని, నాణ్యమైన ఫోన్లు, యూనిఫామ్ ఇవ్వాలని, కాళీ పోస్టులు భర్తీ చమ చేయాలని 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా కమలా మాట్లాడుతూ, 2026 మార్చి 5 వ తేదీనన ప్రభుత్వం ఇచ్చిన హామీల సర్కులర్లను జీవోలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు వేతనాలు పెంచి ఏడు సంవత్సరాలు అయిందని, నిత్యవసర సరుకుల ధరలు విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతున్నా ,వేతనాలు పెరకపోవడంతో, ఆర్థికంగా ఆశ వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆమె అన్నారు. 20 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు సెలవులు లేకపోవడంతో, అనారోగ్యాల పాలౌవుతున్నారని, కావున ( వేసవి సెలవులు మినహా) అన్ని రకాల సెలవులు ఇవ్వాలని ఆమె కోరారు. ప్రభుత్వం చెల్లించే 10,000 రూపాయలలో నెలలో పి. హెచ్.సీ.లకు మరియు ఆసుపత్రులకు వెళ్లడానికి మూడు నాలుగు వేలు వరకు చార్జీలకు ఖర్చవుతున్నాయని కాబట్టి టి ఐ డి ఏ లు చెల్లించాలని ఆమె అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచకపోవడంతో, అధిక జనాభాలో పని చేయడం వల్ల ఆశ వర్కర్స్, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం, శిక్షణ పొందిన ఆశాలకు పర్మినెంట్ పోస్టులు భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించడం లేదని అన్నారు. ఇచ్చిన ఫోన్లు పనిచేయటం లేదని, నా ణ్యమైన ఫోన్లు యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆశ వర్కర్ల, ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జులై 31వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాలు పెద్ద సంఖ్య పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి బి.రాము కార్యదర్శి కె.లక్ష్మి ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాత, లలితా కుమారి,ఉమ, సునీత తదితరులు పాల్గొన్నారు