పయనించే సూర్యడు మే 30 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరంలో శుక్రవారం క్రీడాకారులకు ఉచితంగా అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బాస్కెట్‌బాల్ జాతీయ కోచ్‌గా, హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్న నడిగూడెం గ్రామానికి చెందిన షేక్ ఇసాక్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పీడీ నాగేశ్వరరావుకు సత్కారం: వేసవి సెలవుల్లో క్రీడాకారులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా కబడ్డీ శిక్షణ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) నాగేశ్వరరావును ఈ సందర్భంగా షేక్ ఇసాక్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రేమికుడు అంజన్, శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.