కమదన కిషన్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించిన తక్కెళ్లపల్లి రవీదర్ రావు.

పయనించే సూర్యుడు.. న్యూస్ ..03 నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఈరోజు అకాల మరణం చెందారు, ఈ విషాదకర వార్త తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు . కీర్తి శేషులు శ్రీ కమదన కిషన్ రావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులును పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నారం గ్రామం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కిలారు వెంకన్న, మధుసూదనరావు, కోదాటీ శ్రీను, అవుట మధు, నాగార్జున, తోళ్ళ నాగేశ్వరావు, తిరుమలాపురం గ్రామ సర్పంచ్ కమదన ప్రవీణ్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు మాదాసు ఆదాం,తోళ్ళ రాజ్ కుమార్ తదితరులు పాల్గొని కిషన్ రావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.