కరాటే ఛాంపియన్ షిప్ లో ఏలేశ్వరం విద్యార్థుల ప్రతిభ…

పయనించే సూర్యుడు న్యూస్, జూలై07 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ : )జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం నిర్వహించిన సెకండ్ ఇంటర్ డిస్టిక్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో ఏలేశ్వరం కి చెందిన విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనబరిచి బహుమతులతో పాటు పలువురు ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా కరాటే కోచ్ ఎమ్మెస్ కుమార్ మాట్లాడుతూ తమ వద్ద శిక్షణ పొందుతున్న గొంతిన అఖిల్ కుమార్ సీనియర్ విభాగంలో గెలుపొందారని ద్వితీయ శ్రేణి స్పారింగ్ విభాగంలో పి ప్రవీణ్ విజయం సాధించారన్నారు. వీరికి ఆర్గనైజింగ్ కమిటీ చీప్ శంకర్ చేతుల మీదుగా బహుమతులు పొందారన్నారు. అలాగే బెస్ట్ కోచ్ విభాగంలో కుమార్కు అభినందనలతో పాటు సత్కారం లభించింది అన్నారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆత్మవిశ్వాసం తో పాటు శరీర దారిద్యం కూడా పెంపొందుతుందని. ప్రధానంగా బాలికలు కరాటేలో శిక్షణ పొందే ఆత్మరక్షణకు ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలంటే మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా శిక్షణ పొందాలని ఈ సందర్భంగా కుమార్ సూచించారు.