కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఉమ్మిడి వెంకట్రావు

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 05 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : కాకినాడ జిల్లా ఎఐసిసి జాయింట్ సెక్రెటరీ పాలక్ వర్మ,జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు అధ్యక్షతన ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిలు,మండల అధ్యక్షులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉమ్మిడి వెంకట్రావు మాట్లాడుతూ నాలుగు మండలాల్లో, ఏలేశ్వరం టౌన్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అలాగే ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కష్టపడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అలాగే రాహుల్ గాంధీని భారత దేశ ప్రధానమంత్రిగా చేయడమే తమ లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రాంబాబు,vరాష్ట్ర జనరల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మట్ట శివప్రసాద్ మరియు ఏడు నియోజకవర్గాల ఇంచార్జిలు,ప్రతిపాడు నియోజకవర్గం పిసిసి మెంబర్ ధర్నాలకోట శీను, ఊట శ్రీను, రాముడు సూర్యనారాయణ, దొడ్డిపట్ల సుబ్బరాజు, గోనాపు శ్రీను, పలివెల మల్లేశ్వరరావు, సింగిడి లక్ష్మి,ఎనుముల రాజా, అరిగట్ల రవి, పెదిరెడ్డి వీరబాబు, కొత్తూరు గంగాధర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.