కాంగ్రెస్ బీఎల్‌ఏలకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ

ఎన్నికల విజయానికి బీఎల్‌ఏలే బలమైన సైన్యం : ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ జూన్ 7 ఆసిఫాబాద్ : ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని ఓడ్డేపల్లి గార్డెన్‌లో నిర్వహించిన బీఎల్‌ఏల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఓటరు జాబితాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై ప్రతి బీఎల్‌ఏ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన మోహన్, నరేష్ రాథోడ్ లు బీఎల్‌ఏలకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటరు జాబితా నిర్వహణ, బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు సవివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్, మాజీ డిసిసి అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,జిల్లా గ్రంథాలయం చైర్మన్ అనిల్ కుమార్, డీసీసీ కార్యవర్గ సభ్యులు తారిక్, భీమ్రావు,గాదెవేణి మల్లేష్,విజయ్,శోభన్,యూత్ కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్