కార్మికుల మూడు నెలల బకాయి జీతాలు విడుదల చేయాలి..పి.ఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి.ఈవో శ్రీనివాస్ తో కార్మికులు, సిఐటియు నాయకులు చర్చలు సఫలం..

పయనించే సూర్యుడు జూన్ 5, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామపంచాయతీ కార్మికులు మూడు నెలల బకాయి జీతాలు, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని గురువారం ఉదయం పనులు నిలుపుదల చేసి మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామపంచాయతీ సైట్ లో వచ్చిన మార్పులో భాగంగా గత మూడు నెలల నుండి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ ఈఎస్ఐ చట్టం 1948లో వచ్చిన నేటికీ గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేయకపోవడం దారుణం అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు సగానికి పైగా పంచాయతీల్లో పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయడం లేదన్నారు. సర్పవరం గ్రామపంచాయతీ పరిధిలో సంవత్సర కాలంలో ఐదుగురు పంచాయతీ కార్మికులు చనిపోతే కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడం దారుణం అన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ పోరాడు సాధించిన మట్టి ఖర్చుల నిమిత్తం 15000 మాత్రమే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఇస్తున్నారు అన్నారు. పంచాయతీ కార్మికులకు మూడు నెలల నుండి జీతాలు లేకపోవడంతో ఇంటి అద్దె చెల్లించలేక, కరెంటు, పాలు, మందులు ఇతర నిత్యవసర సరుకులు కొనలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్వర్ణ పంచాయతీ సైట్ లో మార్పులు చేసి కార్మికులు జీతాలు వెంటనే ఇవ్వాలన్నారు. సర్పవరం గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి కొవ్వాడ, రేపూరు, చీడిగ పంచాయతీ కార్మికులు వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

.

సర్పవరం ఈవో శ్రీనివాస్ తో చర్చలు సఫలం

ఉదయం 6 గంటల నుండి పనులు నిలుపుదల చేసి ఆందోళన చేస్తున్న కార్మికులు, సిఐటియు నాయకత్వంతో ఈవో సత్యనారాయణ మధ్యాహ్నం 1 గంటకు చర్చలు జరిపారు. చర్చల్లో కార్మికుల కోరిన ప్రధాన డిమాండ్లను ఈవో పరిష్కరిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. సర్పవరం గ్రామపంచాయతీ పరిధిలో మార్చి నెల జీతాలు జూన్ ఏడో తేదీ లోపు, ఏప్రిల్, మే నెల జీతాలు జూన్ 15వ తారీకు లోపు కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చారు. పీఎఫ్, ఈ.ఎస్ఐ పూర్తిస్థాయిలో కార్మికులందరికీ జూన్ 15 నాటికి వర్తింప చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు నాయకులు అప్పారావు, నాగేంద్ర, శ్రీను, సర్పవరం పంచాయతీ కార్మికులు శివ, శ్రీకాంత్, నాగేశ్వరరావు, వెంకట్రావు, వెంకన్న, శ్రీనివాస్, సత్యనారాయణ, దుర్గాప్రసాద్, వెంకయ్య, నాగేంద్ర, రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.