కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో సంబరాలు

( పయనించే సూర్యుడు మే 23 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మరియు రాయపోల్, మండలాల కేంద్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ప్రకటించిన కనీస వేతనాల పెంపుపై దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. “కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమాల్లో నాయకులు ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనం రూ.20,000గా నిర్ణయించినట్లు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించడాన్ని కాంగ్రెస్ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం చెరుకు శ్రీనివాసరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాజులపల్లి రాజు గారి ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దౌల్తాబాద్ శేర్‌పల్లి గ్రామంలోని వడ్లు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఆయన రైస్ మిల్ యజమానులతో ఫోన్‌లో మాట్లాడి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. అలాగే హైమద్‌నగర్ పత్తి మిల్లును పరిశీలించి అక్కడ వడ్లు నిల్వ చేసే అవకాశాలపై యజమానులతో చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, మిల్ యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి, టైలర్ రమేష్ బండారు లాలు, బొక్కల నాగరాజు, పెరుమాండ్ల నర్సింలు, పంజా స్వామి, కర్ణ శ్రీనివాస్, రైతన్న, ఆది వేణుగోపాల్, లక్ష్మణ్ రమేష్, సంపత్ రెడ్డి, పట్నం యాదగిరి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, పల్లి స్వామి, దుర్గ ప్రసాద్, మహేష్ యాదవ్, డాక్టర్ చందు యాదవ్ రెడ్డి, రాయపోల్ స్వామి, మల్లారెడ్డి, వెంకట్రెడ్డి, నర్సారెడ్డి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.