కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -2 భూపాలపల్లి డివిజన్‌లోని సులబ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, వారికి రావలసిన చట్టపరమైన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.అదేవిధంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని, వారికి చట్టపరంగా కల్పించాల్సిన అన్ని హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.సమావేశం అనంతరం భూపాలపల్లి డివిజన్ జనరల్ మేనేజర్ (జీఎం) కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్యామల, వెంకటలక్ష్మి, రాధ, బద్రి, ఐలన్న, పోచన్న, ఓదేలు, రజిత తదితరులు పాల్గొన్నారు.