కార్మిక శాఖ అధికారిని కలిసిన కార్మిక నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ ప్రతినిధి:07 తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పత్తి బ్రహ్మానంద రెడ్డి కామారెడ్డి ఏ ఎల్ వో సహాయ కార్మిక అధికారి నీ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భవన నిర్మాణ రంగాల కార్మికులు కష్టసుఖాలని వారికి వివరించడంతో వారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అన్నారు.నకిలీ లేబర్ కార్డులు కాకుండా చూడాలని అధికారికి విన్నవించామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మహామేస్త్రి మర్లు సాయిబాబు చిరంజీవిలు, అల్లూరి సాయిలు, నారాయణ, ఖలీల్, రవీందర్ రెడ్డి, తన్నీరు శ్రీనివాస్, నాగార్జున, కొండలరావు, తన్నీరు శేఖర్,తదితరులు పాల్గొన్నారు.