( పయనించే సూర్యుడు జూన్ 13 రాజేష్ ) దౌల్తాబాద్ : బదిలీపై వెళ్లిన మల్లేశం పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజురెడ్డి కి మల్లేశంపల్లి గ్రామ పాలక వర్గం, మహిళా సంఘాలు, మాజీ సర్పంచ్ దార సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ జక్క యశోద, ఉప సర్పంచ్ గణేష్, మహిళా సంఘాల మహిళలు పూల మాల, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ దార సత్యనారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో బదిలీలు సహజమని, బాధ్యత యుతంగా విధులు నిర్వర్తించడం వల్ల ప్రజల మనసులలో నిలిచి పోతారని పేర్కొన్నారు. ఉద్యోగం అనేది ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప బాధ్యత అని, ఆ అవకాశం రావడం గొప్ప అదృష్టం అని తెలిపారు. ఈ సందర్బంగా రాజిరెడ్డి గ్రామ అభివృద్ధి కి చేసిన సేవలు కొనియాడారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రమేష్, నరేష్, అనిత, స్వప్న, గాదె కిరణ్, రేణుక, సాజిదా, వి ఓ ఎ అనిత, మహిళా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.