కిడ్నీ హాస్పిటల్ ను సందర్శించిన జిల్లా జడ్జి

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస లో గల కిడ్నీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ను శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ మొహమ్మద్ మౌలానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు, పలాస జూనియర్ సివిల్ జడ్జి యూ. మాధురి తో కలసి శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా జిల్లా జడ్జి జూనైద్ అహ్మద్ మౌలానా డయాలసిస్ వార్డులను, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించి వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలు, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధి బాధితుల కుటుంబ సభ్యులతో ఆయన కొంతసేపు మాట్లాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ యొక్క ఆర్. ఎం. ఓ., మెడికల్ సూపర్ డెంట్ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలు గూర్చి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సౌమిని, శ్రీకాకుళం, హాస్పిటల్ యొక్క ఆర్ఎంఓ శ్రీహరి బాబు, సూపర్డెంట్ డాక్టర్ శరత్ జోత్స్న, డాక్టర్ రామ్ నరేష్, కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు