కిశోర బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే.20.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// కిషోర్ బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాధా అన్నారు మంగళవారం మండలంలోని ఆమీని గుంట స్వర్ణ గ్రామ పరిధిలోని కిశోర బాలికలకు అంగన్వాడి కేంద్రంలో కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు ఫోక్సో సమాచార హక్కు చట్టాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా సమాజంలో కిషోర్ బాలికల పాత్రను వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త కమలమ్మ కేంద్రం పరిధిలోని కిశోర బాలికలు పాల్గొన్నారు