కుమ్మర శాలివాహన కుల సంఘము ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 03 మామిడిపెల్లి లక్ష్మణ్ ఆషాడ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణకేంద్రంలో గురువారం శ్రీ పెద్దపోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ దేవత అయిన పెద్దపోచమ్మ తల్లి ఆలయానికి సంఘం సభ్యులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముక్కోటి దేవతలకు ముందుగా పోచమ్మ అనే స్థానిక ఆచారాన్ని అనుసరిస్తూ గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బెల్లం నైవేద్యం తో కూడిన బోనాలను తలపై మోసుకుంటు ,గొర్రెపోట్లతో, కల్లు,సాకలతో ఆలయానికి చేరుకున్నారు.పసుపు, కుంకుమ,చీరెలు, సారెలు, నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు, పంటలు, పశు సంపదకు ఎలాంటి ఆపదలు రాకుండా పెద్ద పోచమ్మ తల్లి కాపాడాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రజలందరినీ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లి వేడుకున్నారు .ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొత్త పెల్లి గంగారాం, ప్రధాన కార్యదర్శి గంగాధరి సురేష్, కోశాధికారి కొత్త పెల్లి గంగాధర్, సంయుక్త కార్యదర్శి తుంపెట రాజేష్, కార్యవర్గ సభ్యులు గంగాధరి రాజేశం, కొత్త పెల్లి చిన్న గంగారాం,గంగాధరి గంగాధర్, సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.