కుర్మపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసము

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 03 మామిడిపెల్లి లక్ష్మణ్ ఒకటవ తరగతి లో చేరిన పిల్లలకు అక్షర అరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు మాట్లాడుతూ కుర్మపల్లి గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఏఏపిసి చైర్మన్, సభ్యులు,గ్రామస్థులు, ఉపాధ్యాయులు అందరు కలిసి దాదాపు 30 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయడానికి చేసిన కృషి చాలా అభినందనీయమని పేర్కొన్నారు, ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు, మెరుగైన విద్య బోధన ఉంటుందని అన్నారు. గ్రామ సర్పంచ్ మ్యాకల మల్లేశం 30 మంది పిల్లలకి పలకలు, నోట్ బుక్స్, పెన్సిల్ ప్యాకెట్స్, రబ్బర్లు, చాక్ మర్, బలపల ప్యాకేట్స్ ఇచ్చినందుకు సర్పంచ్ ను ఘనంగా సన్మానించారు. బడి అన్ని రకాల అభివృద్ధి లో ముందు ఉంటానని మ్యాకల మల్లేశం సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎలిగెేటి రాజకిశోర్ అల్లీపూర్, తాట్లవాయ సముదాయ ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్, బోగ రమేష్, ఏఏపిసి చైర్మన్ దయ్యాల కొమురవ్వ, జే.రాజేందర్, వోడ్నాల ప్రియాంక, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, పిల్లల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.