పయనించే సూర్యుడు మే 29 హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : పార్లమెంటులో కులాన్ని రద్దు చేసే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి కోరారు . కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారంవిలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు . కుల నిర్మూలన చట్టం చేయడంవల్ల మన దేశంలో దాడులు , దౌర్జన్యాలు, హత్యలు,అత్యాచారాలు, తగ్గే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశ వైపు ఆలోచన చేయాలని ఆయన అభ్యర్థించారు. ఎస్సీ , ఎస్టీ , బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు , దేశంలోని అయోధ్య, తిరుపతి , షెబరి, షిరిడీ విజయవాడ కనకదుర్గ దేవి కొండగట్టు అంజన్న స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ప్రధాన ఆలయాలలో పూజారులుగా నియమించుకునే అవకాశం ఉంటుందన్నారు , బడి , ఆసుపత్రి , ప్రభుత్వ కార్యకలాపాలలో ఏ విధంగానైతే నడుస్తున్నాయో అదేవిధంగా ఆలయాలలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలను నియమించుకునే అవకాశం కలుగుతుందన్నారు పెళ్ళిళ్ళు ,గృహప్రవేశాలు , ప్రభుత్వ కార్యాలయాల శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలకు వీలు కలుగుతుందన్నారు , కుల నిర్మూలన జరగడానికి ఎన్నో అవకాశాలు కలుగుతాయని వెంకటస్వామి అన్నారు. సమాజంలో , ఆర్థిక, సామాజిక , రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంటుందని బాబా సాహెబ్ అంబేద్కర్ , పూలే, కలలుగన్న సమాజం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు