కూటమి పాలనకు వైసిపి నిరసన గళం

పయనించే సూర్యుడు జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన-న్యూస్ : కూటమి ప్రభుత్వ రెండుసంవత్సరాల పాలనకు నిరసనగా, చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే కారణంతో కాట్రేనికోన వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసిపి అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు కాట్రేనికోన మండల వైసీపీ కోఆర్డినేటర్ నల్లా నరసింహమూర్తి ఆధ్వర్యంలో వైసిపిలోనీ అన్ని విభాగల నాయకులు పెద్ద పాల్గొన్నారు. మొదట కాట్రేనికోన మావూల్లమ్మ గుడి దగ్గరనుండి నాయకులు ర్యాలీగా కాట్రేనికోన మెయిన్ సెంటర్ మీదుగా, గెట్ సెంటర్ వరకు చంద్రబాబు పాలనకు రెండేళ్లు కావస్తున్న హామీల అమలులో కూటమి ప్రభుత్వం వెనకంజలో ఉందని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటిలకు యాభై సంవత్సరాలకు పెన్షన్, అడిబిడ్డ నిధి, రైతు భరోసా లాంటి పథకాలు కూటమి ప్రభుత్వం గాలికి వదలేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలపరిషత్ అధ్యక్షులు కొల్లాటి సత్యం, జెడ్పిటిసి నేల కిషోర్, రాష్ట్ర నాయకులు నడింపల్లి సూరిబాబు రాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నడింపల్లి సందీప్ వర్మ,కాట్రేనికోన మాజీ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్,పల్లంకుర్రు మాజీ సర్పంచ్ నాతి అలివేణి, మండల మహిళా విభాగం అధ్యక్షులు మోకా చంద్రనాగరత్నం, జిల్లా నాయకులు అక్కల శ్రీధర్, సీనియర్ నాయకులు తటవర్తి వెంకటరత్నం, జిల్లా రజక అధ్యక్షులు కోటిపల్లి నరేంద్రరెడ్డి, పల్లం మాజీ సర్పంచ్ మల్లాడి వీరబాబి, లక్ష్మివాడ మాజీ సర్పంచ్ చోల్లంగి వెంకటేశ్వరరావు,జిల్లా ప్రచారకమిటీ నాయకులు గిడ్ల శ్రీనివాసరావు, మండల ఎస్సి సెల్ నాయకులు అయితాబత్తుల శ్రీనుబాబు, మండల నాయకులు చల్లగల అప్పారావు,వరసాల చిన్నరావు, నాతి కవిరాజు, బూల పృథ్వి, పి ఎస్ యన్,కాశి కుమార్ తదితరులు పాల్గొన్నారు