కూడేరు నూతన తాసిల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపిన పత్రిక విలేకరులు, ఎమ్మార్పీఎస్ నాయకులు

జనం న్యూస్ కూడేరు జూన్ 7 రిపోర్టర్ ముంగా ప్రదీప్ ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల నూతన తాసిల్దార్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన కె.మోహన్ కుమార్,ని శనివారం స్థానిక మండల తాసిల్దార్ కార్యాలయంలో విలేకరులు ఎం ఆర్ పి ఎస్,వి హెచ్ పి ఎస్ నాయకులు బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు సాధారణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు విలేకరులు పూలమొక్కను (బొకే) అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల సమస్యలపై తాసిల్దార్‌తో వారు పలు విషయాలను చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, మండల అభివృద్ధికి విలేకరుల బృందం ఎల్లప్పుడూ అధికారులకు సహకరిస్తారని. ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దీనిపై తాసిల్దార్ సానుకూలంగా స్పందిస్తూ, మండల పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల ప్రజల సమస్యలపై నా వంతు నా పరిదిన పట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నేను చేయలేని ప్రజల సమస్యలను జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తానని ఈ సందర్భంగా విలేకరుల ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పత్రికా విలేకరులు ఆంధ్రప్రభ ఎం ఎర్రి స్వామి, నేటి సూర్య విలేకరి సూర్య బాబు, సాక్షి డిజిటల్ న్యూస్ జిల్లా ఇన్చార్జ్ విలేఖరి ప్రదీప్, ఎం ఆర్ పి ఎస్ నాయకులు, ఎం రాజు జిల్లా ఉపాధ్యక్షులు, బి హెచ్ పి ఎస్ నాయకులు కలగళ్ల ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు… నూతన తాసిల్దార్ని కలిసిన విలేకరులు ప్రజా సంఘాల నాయకులు..