కెన్యా తండాలో వైభవంగా పుట్టు చీర మహోత్సవం.. తరలివచ్చిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మండల నాయకులు

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్ చందర్ నాయక్

పయనించే సూర్యుడు జూన్ 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్బిజినపల్లి (నియోజకవర్గం ప్రతినిధి): బిజినపల్లి మండల పరిధిలోని కీమ్య తాండ గ్రామంలో శనివారం పుట్టుచీర మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన సర్పంచ్ రామచంద్ర నాయక్ కుమార్తె పుట్టుచీర మహోత్సవ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నూతన వధూవరులను/బాలికను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించి, పండుగ వాతావరణాన్ని పంచుకున్నారు. మన ప్రజాప్రతినిధి తమ ఇంటి వేడుకకు తరలిరావడం పట్ల సర్పంచ్ రామచంద్ర నాయక్ కుటుంబ సభ్యులు మరియు తాండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. ​ఈ మంగళకరమైన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బిజినపల్లి మండల పార్టీ అధ్యక్షులు, మిద్దె రాములు జిల్లా బంజారా నాయకులు గోవిందు నాయక్. స్థానిక సర్పంచులు, మునీందర్ నాయక్ రామ్ చందర్ నాయక్ హనుమనాయక్ విజయ్ దీప్లా ఎంపీటీసీలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మరియు తాండా ప్రజలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.