పయనించే సూర్యుడు న్యూస్:జూన్/14:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన.స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛభారత్. కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన బీజేపీ ఓబిసి రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల రాజు, మాట్లాడుతూ ..మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారి ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి 21 తారీకు వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, సూచన మేరకు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాఠశాల గదులు పిల్లల బెంచీలు కుర్చీలు ఆవరణంలోని వారండా శుభ్రంగా కడిగి పాఠశాల ఆవరణంలో ఉన్న కలుపు మొక్కలు తీసేసి డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేసి గ్రౌండ్ లో ఉన్న చెత్తాచెదారాన్ని ఉడ్చి చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని శుభ్రం చేసి కడిగి పూజ చేసి స్వచ్ పాఠశాలగా మార్చడం జరిగింది. ముఖ్య అతిథులు బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి రాజు అడిచెర్ల, మాట్లాడుతూ తిరిగి సోమవారం పాఠశాల పునః ప్రారంభం రోజు కనుక పిల్లలకి వేసవికాలం సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చే పిల్లలకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా శుభ్రపరిచి పిల్లలు మంచిగా చదువు మీద దృష్టి పెట్టే విధంగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మన ప్రియతమ నాయకులు బండి సంజయ్, పిల్లల చదువుల కోసం చదువుకునే పేద పిల్లల కోసం ఎల్లప్పుడూ పరితపించే నాయకుడు గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పిల్లలకి పరీక్ష రుసుము చెల్లించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి పాఠశాలకు వచ్చి పోయే సమయాన్ని వృధా కాకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా సైకిలు అందజేయడం జరిగింది.గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి పిల్లలకి పరీక్ష ఫీజులు మరియు సమయం వృధా కాకుండా మళ్లీ అందరికీ సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తానని బండి సంజయ్, హామీ ఇచ్చారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి పిల్లలందరికీ సైకిలు ఇస్తారు. కోరిక మీరందరూ చదువుపై దృష్టి పెట్టి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి వెళ్లి సంజయ్, కోరికను నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా మన ప్రియతమ నాయకులు సంజయ్, పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేద విద్యార్థుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సేవే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా కరీంనగర్ పార్లమెంటులో ఎప్పుడూ ఒక వినూత్న సేవా కార్యక్రమాలు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు రోడ్లు బ్రిడ్జి పనులు హైవే రోడ్లు ప్రకృతి వైపరీత్యానికి ఎవరికైనా ఆపద వచ్చినా కూడా హైదరాబాద్ నుంచి రక్షణ దళాలను నేవీ ఆర్మీ బలగాలను తీసుకువచ్చి ఆదుకునే వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు ఇలాంటి సేవ చేసేవ్యక్తి దొరకడం చాలా అదృష్టం,, అలాగే మన గ్రామాలలో ఉన్న ఏ ఒక్కరిని కూడా చదువు దూరంగా ఉండకుండా వివిధ కారణాల వల్ల బడికి వెళ్లలేని పిల్లలందరినీ గుర్తించి స్కూలుకు పంపించే విధంగా ప్రయత్నించాలి మరియు ప్రతి ఒక్కరిని పాఠశాలలకు వెళ్లి చదువుకునే విధంగా మండలంలోని అన్ని గ్రామాలలో ర్యాలీ కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూముల అనిల్ కుమార్ మానకొండూరు అసెంబ్లీ జాయింట్ కన్వర్ బత్తిని స్వామి గౌడ్, తిప్పారపు శ్రావణ్, మ్యాకల మల్లేశం, పున్ని సంపత్, లంకోజ్ చంద్రం, కొనబోయిన బాలరాజు, మామిడి హరీష్,కొనబోయిన పరుశురాం, ప్రశాంత్, నాగరాజు, పరశురాములు, తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.