కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.

సి.పి.యం.నాయకులు డిమాండ్.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 29 కేరళ మాజీ ముఖ్యమంత్రి సి.పి.ఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్.పినరయి విజయన్ పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిన ఈడి దాడులు నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం గూడూరు పట్టణంలోనీ పాత బస్టాండ్ ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సి.పి.ఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడులు చేయించడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని దీన్ని సి.పి.ఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలు పోరాటాలకు ఎప్పుడు ప్రజలకు అండగా నిలుస్తుందని వారు హెచ్చరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడి ద్వారా పినరయి విజయనివాసాలపై దాడి చేయడానికి సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నుండి తొలగిన వెంటనే నివాసాలపై ఈడి దాడులు చేయడం చాలా దారుణమని, ప్రతిపక్ష నాయకుల పై దాడి చేయడం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడమేనని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కక్ష రాజకీయాలు మానుకోవాలని వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, నాయకులు టి. వెంకటరామిరెడ్డి, బి.వి రమణయ్య, అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, గండికోట మధు, పుట్టా శంకరయ్య,ఎస్టీ.రఫీ బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.