పయనించు సూర్యుడు జూలై 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొగళ్ళమూరు అల్లవరం మండల భారతీయ జనతా పార్టీ కమిటీ సమావేశం మొగళ్ళమూరు గ్రామంలో జరిగింది. మండల అధ్యక్షుడు కట్టా నారాయణమూర్తి అధ్యక్షతన, మండల ఇన్‌చార్జి మోకా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గౌరవ ఆహ్వానితులుగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్లో 90 శాతం కేంద్రం అందిస్తోందని తెలిపారు. ప్రజా ఉపయోగకరమైన సిమెంట్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్రానికి నాలుగు లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఉన్న అనుమానాలను అధికారుల వద్ద నివృత్తి చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకర సాయి, జిల్లా కార్యదర్శి రేకడి సత్యనారాయణ వర్మ, అన్నవరం మండల ప్రధాన కార్యదర్శులు అంగాని ధనుంజయ వర్మ, కట్టా అనిల్, కార్యదర్శులు బాలం నాగ సత్యవతి, చిట్టూరి కుమారి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు కట్టా జనార్ధన్, మొల్లేటి రాంకుమార్, ఏకుల దుర్గ నాగరాజు, చెల్లిబోయిన బాలమహేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లవరం మండల భారతీయ జనతా పార్టీ సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు.