పయనించే సూర్యుడు జూన్ 5 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కెనరా బ్యాంక్ ఓల్డ్ టౌన్ శాఖ చీఫ్ మేనేజర్ రాజేష్ రాజమోహన్ ఆధ్వర్యంలో ఆదోని ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకర్లు, శాఖల అధికారులు మరియు పారిశ్రామికవేత్తలతో అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదోని ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకులు చొరవ చూపాలని కోరారు.పాడి పరిశ్రమ రైతులకు విరివిగా రుణాలు అందించండి.*- పి మోహన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ మాట్లాడుతూ, బ్యాంకులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలును వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ రంగాలకు విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. అదేవిధంగా సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎం ఈ జి పి, పిఎం ఎఫ్ఎంఈ , పీఎం సూర్యా గర్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలని తెలిపారు.ఈ సందర్భంగా సీబీఆర్సెటి డైరెక్టర్ పుష్ప కుమార్ మాట్లాడుతూ, కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటి ఐ) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులోని శిక్షణ కేంద్రంలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గం పరిధిలోని వివిధ బ్యాంకుల శాఖ మేనేజర్లు, అగ్రికల్చర్, బి ఆర్ ఏ, ఎం ఈ పి ఎం ఏ , మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు మరియు స్వయం ఉపాధి అభిలాషులు పాల్గొన్నారు.