పయనించే సూర్యుడు మే 29 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : కేశవపట్నం గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఏల్లమ్మ పట్నాలు వేస్తున్న సందర్బంగా గురువారం నాడు పోచమ్మ బోనాలు గౌడ కుటుంబలు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు గుఱ్ఱం శ్రీనివాస్ గౌడ్, , గౌడ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, పాలుగొని గ్రామంలోని అమ్మవారు పోచమ్మ కు ఘనంగా బోనాల ద్వారా గౌడ సంఘం ఐక్యత చాటలని, బైండ్ల పూజారుల, డప్పు చప్పుల్లతో అట పాటలతో ఘనంగా పోచమ్మ బోనాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, పెద్ద ఎత్తున పాలుగోన్నారు